ఏఎంవిఐ పై దాడి
ఖండించిన అధికారులు
కాకినాడ ముచ్చట్లు:

విధి నిర్వహణలో ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ ఎం.చిన్నారావుపై ఒక వ్యక్తి దాడి చేయడాన్ని అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ ఎస్.వి.ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. కాకినాడ డి.టి.సి. కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ప్రసాద రావు మాట్లాడుతూ కాకినాడలో కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తి చేసిన దాడిలో తీవ్రంగా గాయ పడిన అసిస్టెంట్ మోటర్ ఇన్స్పెక్టర్ చిన్నారావు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని, విధుల నిర్వహణలో ఉన్న అధికారి పై ఏవిధమైన దాడి జరగడం చాలా విచారకరమన్నారు.ఈ సంఘటనపై రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ ఈ ఘటనపై తీవ్రంగా ఖండించారని తెలిపారు . జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యమ్. రవీంద్రనాధ్ బాబు వెంటనే స్పందించి దాడి చేసిన వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేస్ నమోదు చేశారని చట్ట ప్రకారం చర్యలు తీసుకుని శిక్ష పడేటట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ మీడియా సమావేశంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.హెచ్. శ్రీదేవి, రవాణా శాఖ అధికారులు ఐ. రాజబాబు, ఆర్. సురేష్, పి.వి. సాయిబాబు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags;Attack on AMVI
