ఆశా వర్కర్ పై దాడి

Date:03/04/2020

అదిలాబాద్ , ముచ్చట్లు:

అదిలాబాద్ జిల్లాలో ఇటీవల డిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తి ఇంట్లో సర్వే కు వెళ్లిన ఆశావర్కర్ పై అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. అదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇటీవల డిల్లీలో నిజాముద్దీన్ ప్రార్ధనలో పాల్గొని తిరిగి అదిలాబాద్ చేరుకున్నాడు. చిలుకురి పిహెచ్ సీ పరిదిలో పనిచేసే భారతీ అనే ఆశావర్కర్ ఇటీవలే డిల్లీకి వెళ్లి వచ్చిన  వ్యక్తి ఇంటికి సర్వేకు వెళ్లింది. అతని  కుటుంబానికి సంబందించిన వివరాలు సేకరిస్తుండగా ఆ వ్యక్తి సోదరుడు అల్తాఫ్ హుస్సేన్,  భారతి పై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఆమె చేతిలో ఉన్న సర్వే రిపోర్టును బలవంతంగా లాక్కొని చించివేయడంతో పాటు బెదిరించాడు. దాంతో భారతి  భయపడి అక్కడినుంచి ప్రాణ భయంతో వచ్చి తన పై అధికారులకు సమాచారం ఇచ్చింది.  తన శాఖ ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. భాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అన్ టౌన్ సీఐ సురేష్ తెలిపారు.

 దాతల నుండి బియ్యం, ఆహారం సేకరణ  – పంపిణీకి జిహెచ్ఎంసి

Tags:Attack on Asha Worker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *