నకిలీ ఐస్ క్రీం సెంటర్ పై దాడి..కేసు నమోదు
రంగారెడ్డి ముచ్చట్లు:
సైబరాబాద్ పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధి పద్మారావ్ నగర్ ఫేస్ 2 లో నిభందనలకు విరుద్దంగా నడుస్తున్న నకిలీ ఐస్ క్రీం సెంటర్ పై పోలీసులు దాడి జరిపారు. తరువాత కేసు నమోదు చేసారు.
చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్క్రీమ్ రంగురంగుల కలర్స్ తో ఆకర్షిస్తుంది.. ఈ ఐస్క్రీమ్ పిల్లల ఆరోగ్యాన్ని నష్టవరుస్తుందని ఎంతమందికి తెలుసు. కానీ ఆ ఐస్క్రీమ్ సరైందా లేక నాసిరకమయిన వస్తువులు తో తయారు చేసిందా అనేది తెలియదు.
ముక్కు పచ్చలారని చిన్నారుల జీవితాలతో ఆటలు ఆడుతున్న ఐస్ క్రీం ముఠా తయారి కేంద్రాలపై పేటబషీరాబాద్ పోలీసులు ఆద్వర్యంలో దాడులు నిర్వహించారు. పద్మానగర్ ఫేస్ 2లో నిబంధనలు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో రహస్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ఐస్క్రీమ్ తయారీ నిర్వాహకులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Attack on fake ice cream centre..Case registered

