హెల్త్ సెంటర్ పై దాడి

కామారెడ్డి   ముచ్చట్లు:
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పై బాధితులు దాడికి పాల్పడ్డారు.ఈఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో జరిగింది.   టీకా ఇవ్వడం లేదంటూ హెల్త్ సెంటర్ అద్దాలను ధ్వంసం చేశారు. ప్రభుత్వం నుంచి స్టాక్ రావడంలేదని, ఎంత స్టాక్ వస్తే అంతమందికి కరోనా ఇస్తున్నామని హెల్త్ సెంటర్ సిబ్బంది పేర్కొన్నారు. కరోనా టీకా ఇవ్వడం లేదంటూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పై బాధితులు దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ సిబ్బంది మాట్లాడుతూ హెల్త్ సెంటర్ కు ఎంత స్టాక్ వస్తే అంతమందికి కరోనా టీకాను ఇస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 400 మంది టీకా కోసం హెల్త్ సెంటర్ కు తల్లి రావడం జరిగిందని తెలిపారు. కానీ హెల్త్ సెంటర్లో 100 టీకాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో 100 టోకెన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ కొందరు టీకా కోసం హెల్త్ సెంటర్ లొకి చొచ్చుకు   వచ్చి అద్దాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. స్టాక్ ఎంత ఉంటే అన్ని టీకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం పట్టణ ప్రజలు గమనించాలని కోరారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Attack on Health Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *