భార్యపై భర్త కత్తితో దాడి

Attack on husband with knife

Attack on husband with knife

Date:18/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

కట్టుకున్న భార్యపై అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపేందుకు భర్త ప్రయత్నించగా భార్య తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన గురువారం పట్టణంలో జరిగింది. కొత్తపేటకు చెందిన భుజంగరావు, ఆయన భార్య యామిని కలసి ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువురు కూలి పనులు చేసుకుంటు నివాసం ఉన్నారు. ఇలా ఉండగా భుజంగరావు సెంట్రింగ్‌ కమ్మి పనులకు వెళ్లేవాడు. ఇలా ఉండగా యామిని ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందేమోనన్న అనుమానంతో భుజంగరావు తరచు భార్యతో గొడవలు పడేవాడు. ఇలా ఉండగా ఉదయం ఇంటిలో ఇద్దరులు ఘర్షణ పడ్డారు. భుజంగరావు ఇంటిలో ఉన్న కత్తిని తీసి భార్యపై దాడి చేశాడు. ఈ దాడిలో యామిని తలకు , శరీరంపై తీవ్ర గాయాలైంది. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. భాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

దోమలపై దండయాత్ర

Tags: Attack on husband with knife

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *