Natyam ad

పుంగనూరులో మంగతాయిజూదం కేంద్రంపై దాడి- ఇద్దరు అరెస్ట్

-రూ.1.40 లక్షలు స్వాధీనం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

చెడు అలవాట్లకు బానిసులు చేయడానికి కొంత మంది చేస్తున్న కుట్రలను బుధవారం పోలీసులు తిప్పికొట్టారు. జూదం కేంద్రంపై దాడి చేసి ఇద్దరు వ్యక్తలను అరెస్ట్ చేసి , వారి వద్ద నుంచి రూ.1.40 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పాళ్యెంపల్లె సమీపంలో కర్నాటకాకు చెందిన అరుణ్‌కుమార్‌, దేవప్ప తో పాటు పుంగనూరు, రామసముద్రం, మదనపల్లె ప్రాంతాలలో మరి కొంత మంది కలసి మంగతాయిజూదం నిర్వహిస్తుంటారు. వీరికి మదనపల్లెకి చెందిన అర్జున్‌రెడ్డి, పుంగనూరు మండలం పెద్దతాండాకు చెందిన బాలాజినాయక్‌, రామసముద్రం మండలం అరటికాయలరాజా లు కలసి ప్రతి రోజు డాబా వద్ద సమావేశమై ఫోన్ల ద్వారా సమాచారం అందించి, మంగతాయి జూదం నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు జూదంలో పోగొట్టుతున్నట్లు తెలిపారు. సమాచారం మేరకు సీఐ రాఘవరెడ్డి, ఎస్‌ఐలు సుకుమార్‌, మోహన్‌కుమార్‌ ల ఆధ్వర్యంలో పోలీసులు పాళ్యెంపల్లె జూదం కేంద్రంపై పకడ్భంధిగా దాడులు నిర్వహించారు. ఈ సమయంలో సుమారు 15 మంది పరారీ కాగా అరుణ్‌కుమార్‌, దేవప్ప పోలీసులకు చిక్కారు. వీరి నుంచి రూ.1.40 లక్షలు నగదు స్వ్యాధీనం చేసుకుని , వారిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామన్నారు. కాగా ఎక్కడైన పేకాట, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసకుంటామని, కేసులు నమోదు చేస్తామన్నారు. పేకాట, జూదం నిర్వహించే వారిపై తమకు సమాచారం అందించాలని సీఐ ప్రజలను కోరారు.

 

Tags: Attack on Mangatai gambling center in Punganur- Two arrested

Post Midle