Natyam ad

పుంగనూరులో పథకం ప్రకారమే పోలీసులపై దాడి- అడిషినల్‌ ఎస్పీ శ్రీలక్ష్మీ వెల్లడి

– ఏ1గా చల్లా రామచంద్రారెడ్డి
– 62 మంది అరెస్ట్

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

చంద్రబాబు పర్యటనలో ఉద్ధేశపూర్వకంగానే తెలుగుదేశం అల్లరి మూకలు పోలీసులపై దాడి చేసి , గాయపరచి, పోలీస్‌ వాహనాలను తగులబెట్టారని చిత్తూరు జిల్లా అడిషినల్‌ ఎస్పీ కె.శ్రీలక్ష్మీ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె పుంగనూరులో పలమనేరు డిఎస్పీ సుధాకర్‌రెడ్డి, ఎస్‌బి డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ అశోక్‌కుమార్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీలక్ష్మీ మాట్లాడుతూ చంద్రబాబు పర్యటన రూట్‌మ్యాప్‌ను కాదని దౌర్జన్యంగా పట్టణంలోని తెలుగుదేశం మూకలు రావడంతో నివారించిన పోలీసులపై రాళ్లు, మధ్యం బాటిళ్లు, కట్టెలతో దాడి చేసి పోలీసులను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ కేసులో ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి, సీసీ ఫ్రుటేజ్‌లు, సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు చేసిన వారిలో 62 మందిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలిస్తున్నామన్నారు.

చల్లా వ్యూహం…

చంద్రబాబు పర్యటనలో అల్లర్లు సృష్టించాలని, పోలీసులపై దాడులు చేయాలని, అవసరమనిపిస్తే పోలీసులను చంపాలని, ఆ సమయంలో పోలీసులు కాల్ఫులు జరిగితే తెలుగుదేశం వారు చనిపోతే దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇమెజ్‌ పొందేలా తెలుగుదేశం ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఈనెల 2న రొంపిచెర్లలో వ్యూహం సిద్దం చేశారన్నారు. పార్టీ సమావేశంలో పార్టీ క్యాడర్‌ను ప్రేరేపించడంతో దాడులు జరిగిందని ఏఎస్పీ శ్రీలక్ష్మీ తెలిపారు. చల్లారామచంద్రారెడ్డి పీఏ గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా పీఏ ఈ విషయాలను వెల్లడించారని తెలిపారు. దాడులకు ప్రధాన కారకుడుగా చల్లారామచంద్రారెడ్డిని పేర్కొన్నామన్నారు. చల్లా రామచంద్రారెడ్డి పరారీలో ఉన్నాడని, ఇందుకు బాధ్యులైన వారందరిని అరెస్ట్ చేస్తామని ,ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసును త్వరగా చేధించిన పోలీసులను ఎస్పీ తరపున అభినందించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ మోహన్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Attack on police in Punganur was planned – Additional SP Srilakshmi revealed

Post Midle