ఎస్సై పై దాడి
హైదరాబాద్ ముచ్చట్లు:
మారేడుపల్లి ఎస్సై వినయ్ కుమార్ పై ఇద్దరు దుండగులు దాడి జరిపారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్ఐ పై తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో కత్తితో పొడిచినట్లు నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. గాయపడ్డ ఎస్సైను గీతా నర్సింగ్ హోమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నిందితులు లంగర్ హౌస్ కు చెందిన టమాట పవన్ సింగ్ (24), జవహర్ నగర్ చెందిన సంజయ్ సింగ్ (22) లు గా పోలీసులు గుర్తించారు. నిందితులు చాలా చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Tags: Attack on SSI