తహసీల్దార్ పై దాడి అమానుషం…

జగిత్యాల  ముచ్చట్లు:
మెదక్ జిల్లా శివ్వంపేట మండల తహశీల్దార్ భానుప్రకాశ్ పై హత్యాయత్నం అమానుషంగా ఉందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఐక్య కంఠం తో ఖండిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎం.డీ.వకీల్, గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,తహశీల్దార్లు వెంకటేష్,దిలీప్ నాయక్ లు పేర్కొన్నారు. బుధవారం జిల్లా రెవెన్యూ భవన్లో వారు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు, తహసీల్దార్లే కారణం కాదని వారు వివరించారు. భూసమస్యల ను పరిష్కరించే పలు సమస్యల పరిష్కారం ధరణి వెబ్ సైట్ లో లేదని వాటిని రైతులు అర్థం చేసుకోవాలన్నారు.వెబ్ సైటులో అన్నిటికీ ఆప్షన్లు  వచ్చేదాకా సంయమనం పాటించాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల,అధికారుల,తహసీల్దార్ల పై దాడులు జరుగ కుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.తహశీల్దార్ కార్యాలయాలన్నింటిలో  సిసి కెమెరాలు  పోలీసు బందోబస్తు  ఏర్పాటు చేయాలన్నారు. గతంలో  అబ్దుల్లాపూర్ మెట్ లో తహసీల్దార్ సజీవదహనం,నిన్నటి రోజున మంగళవారం శివ్వంపేట లో తహశీల్దార్ పై డీజిల్ పోయడం వంటి  దుర్ఘటనల పట్ల రెవెన్యూ ఉద్యోగుల్లో,తహసీల్దార్ల లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ఈ విషయం లోట్రెసా రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి,కే. గౌతమ్ కుమార్ లు ప్రభుత్వానికి  నివేధించారని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరినట్లు వారు రెవెన్యూ ఉద్యోగులకు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి చెలుకల కృష్ణ, కోశాధికారి ఎన్. తిరుమల రావు,నాయబ్ తహశీల్దార్ గండ్ర రాజేందర్ రావు, జిల్లా కార్యవర్గ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Attack on Tehsildar is inhuman …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *