అనుమతిలేని ఈవెంట్ పై దాడి..ఏడుగురు అరెస్టు
మేడ్చల్ ముచ్చట్లు :
పేట్ బషీరాబాద్ పోలీసు పరిధి లోని కొంపల్లి ఎస్ఎన్ఆర్ గార్డెన్స్ లో పేట్ బషీరాబాద్ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడి జరిపారు. అక్కడ అనుమతులు లేకుండా మద్యం సిట్టింగ్ ఏర్పాటు, కిట్టి పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ దాడులలో ఆర్కెస్ట్రా, మొత్తం 7మందిని అదుపులోకి తీసుకొకి సొంత పూచీకత్తు తో వదిలేసారు. ఆర్కెస్ట్రా మేనేజ్మెంట్, ఎస్ఎన్ఆర్ గార్డెన్ యాజమాన్యం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Attack on unauthorized event..Seven people arrested

