అనుమానంతో యువకుడిపై దాడి

చిత్తూరు ముచ్చట్లు:


తన భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో యువకుడిని కత్తితో దాడి చేశాడు. చిత్తూరులో ఈ ఘటన కలకలం రేపింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఎంజీఆర్‌ వీధిలో ఉన్నట్లుండి అరుపులు, కేకలు వినిపించడంతో దుకాణదారులంతా ఉలిక్కిపడ్డారు. అందరూ తేరుకునేలోపే రక్తస్రావమైన వ్యక్తి పరిగెత్తుకుంటూ స్టేషన్‌కు వెళ్లగా కత్తితో పొడిచిన వ్యక్తి పరారయ్యాడు. స్థానికుల వివరాల మేరకు… సంతపేట ఇంగిరానగర్‌కు చెందిన సాయి ప్రకాష్‌ ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్‌ కోర్సు నేర్చుకుంటున్నాడు. అదే కాలనీకి చెందిన శీనా బేకరి నడుపుతున్నాడు. తన భార్యతో సాయి ప్రకా్‌షకు వివాహేతర సంబంధం ఉందని శీనా అనుమానిస్తూ వచ్చాడు. మందలించినా వినకుండా సాయి ప్రకాష్‌ ఆమెతో తరచూ ఫోన్లు చేయడమేగాక కనపడిన చోట మాట్లాడుతుండేవాడు. ఆగ్రహానికి గురైన శీనా మంగళవారం అతడిని అనుసరించాడు. ఎంజీఆర్‌ వీధిలోని కంప్యూటర్‌ సెంటర్‌కు వచ్చిన సాయి ప్రకా్‌షపై అప్పటికే అక్కడికి చేరుకున్న శీనా కత్తితో దాడి చేశాడు. మెడపై నాలుగైదుసార్లు పొడిచాడు. రక్తస్రావం కావడంతో సాయి ప్రకాష్‌ తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని చిత్తూరు ప్రభుత్వాసత్రికి అతనే నడుపుకుంటూ వెళ్లిపోయాడు. చికిత్స చేసిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం సీఎంసీకి రెఫర్‌ చేశారు. కొంతసేపటికి నిందితుడు శీనా ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు సమక్షంలో లొంగిపోయారు.

 

Tags: Attack on youth on suspicion

Leave A Reply

Your email address will not be published.