Natyam ad

వైఎస్సార్‌సీపీ నేతలపై దేశం గుండాల దాడి

– కర్రలు, రాళ్లు తో దాడి
– ధ్వసమైన షాపులు, ఐదుమందికి గాయలు
– కేసులు నమోదుచేసిన పోలీసులు

చౌడేపల్లె ముచ్చట్లు:

Post Midle

ప్రశాతంతకు మారుపేరైన పుంగనూరు నియోజకవర్గంలో రోజు రోజుకు తెలుదేశం పార్టీ విధ్వసంకరమైన చర్యలు, దాడులు తీవ్రమౌతున్నాయి. మద్యం మత్తులో కారులో వెళ్తున్న తెలుదేశం పార్టీనాయకులు పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీనేతల ఇంటి ముందు ఆపి ఇంటిలోకి చొరబడి రాళ్లు, కట్టెలు తో దాడులు చేశారు. అడ్డువచ్చిన వారిని విచక్షణారహితంగా కొట్టడంతో ఐదుమంది తీవ్రంగా గాయపడిన సంఘటన శనివార ం రాత్రి చౌడేపల్లె మండలంలోని బోయకొండ క్రాసు వద్ద జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి……..

 

 

 

. వైఎస్సార్‌సీపీ నాయకుడు రాష్ట్ర పాల ఏకరి కార్పొరేషన్‌ డైరక్టర్‌ లడ్డూరమణ, అతని కుటుంబ సభ్యులు అనుచరులు కలిసి రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఎన్నికల ప్రచారం పై మాట్లాడుకుంటుండగా అదే సమయంలో తెలుగుదేశం నాయకుడు గువ్వల రమేష్‌రెడ్డి మంజునాథ్‌రెడ్డి, మణికంఠ, సునీల్‌కుమార్‌, ఆదిశేషు,సుబ్రమణ్యం,గణ లు వింధు లో కలిసి అతిగా మద్యం సేవించి కారులో చౌడేపల్లెకు వెళ్తుతూ లడ్డూరమణ ఇంటి వద్ద ఆపి ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీ నేతల ను దూషిస్తూ రమణ ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి రాళ్లు ,కట్టెలతో దాడులు చేశారు. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీల గుంఢాలు దాడిచేయడం, అడ్డువచ్చిన వారిని విచక్షణారహితంగాకొట్టి వైఎస్సార్‌సీపీ నాయకులను అంతవెహోందిస్తామని మిమ్మల్ని తిరగనివ్వమని దూషిస్తూ హెచ్చరికలు చేశారు. అంతటితో ఆగకుండా లడ్డురమణకు చెందిన కూల్‌డ్రింగ్‌ షాపులు, హ్గటల్‌లోకి చొరబడి కట్టెలు, రాళ్లతో షాపులోని వస్త్రువులను అద్దాలను ప్రిడ్జ్లను ధ్వసం చేశారు. ఇంటి ముందు బాగంగా తలుపులు, కిటికీలు సైతం ధ్వసం అయ్యాయి.ఒక్కసారిగా భయాణక వాతావరణం సృష్టించడంతో ఆప్రాంత వాసులు తెలుగుదేశం గుండాల దాడులకు భయకంపితులైయ్యారు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ నేతలు లడ్డురమణ,మోహన్‌, ప్రసాద్‌, చరణ్‌, సుబ్బు , వెంకటరెడ్డి తదితరు లను మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులు చికిత్సపొందుతున్నారు. సంఘటనా స్థలాన్ని పలమనేరు ఎస్‌డిపిఓ మహేశ్వర్‌రెడ్డి సందర్శించారు. బోయకొండ క్రాసు లో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటుచేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నారు.

కేసులు నమోదుచేసిన పోలీసులు……

బోయకొండ క్రాసులో గల లడ్డూ రమణ ఇంటిలో కి చొరబడి ధ్వసం చేయడంతోపాటు వైఎస్సార్‌సీపీనేతల పై దాడి , హత్యాయత్నం తోపాటు నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు ఏడు మందిపై నమోదుచేశారు.తెలుగుదేశం పార్టీనేతలు గువ్వల రమేష్‌రెడ్డి, మంజునాథ్‌రెడ్డి ,మణికంఠ,సునీల్‌కుమార్‌,ఆదిశేషు,జె. సుబ్రమణ్యం, గణలపై కేసు నమోదుచేశారు. ఈమేరకు తెలుగుదేశం పార్టీనేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాధుపై వైఎస్సార్‌సీపీనేత లడ్డురమణతో పాటు మరికొందరిపై కేసులు నమోదుచేశారు.

Tags: Attack on YSRCP leaders by country gangs

Post Midle