ప్రశ్నించినందుకు దాడి చేసారు

Date:29/10/2020

సికింద్రాబాద్  ముచ్చట్లు:

కంటోన్మెంట్ మారేడ్ పల్లి లో దారుణం చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమకారుడు బొట్టు ప్రభాకర్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలైన బాధితుడు  పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు బొట్టు ప్రభాకర్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తనపై అకారణంగా ఎమ్మెల్యే సాయన్న ప్రధాన అనుచరులు  బోయిన పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్,  మార్కెట్ డైరెక్టర్ శర్వాన్, టి ఆర్ ఎస్ నాయకుడు పిట్ల నగేష్ లు  మరో 30 మంది తో కలిసి తనపై అకారణంగా పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. వర్షం కారణంగా నష్టపోయిన అర్హులైన ముంపు బాధితులకు సీఎం  సహాయం అందడం లేదని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు, కొందరు ఎమ్మెల్యే సాయన్న అనుచరులు తనకు ఫోన్ చేసి దూషించడం కాకుండా నువ్వు ఎక్కడున్నావో చెప్పు నీ అంతు  తేలుస్తామని హెచ్చరించారని అన్నాడు.  ఆ తరువాత ఈ దాడికి పాల్పడ్డారని ప్రభాకర్ వాపోయాడు. భవిష్యత్తులో తనకు వీరితో ప్రాణహాని ఉందని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాడు. తనపై అకారణంగా దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే సాయన్న అనుచరులపై పార్టీ అధిష్టానం దృష్టికి సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నాడు.

మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన నారాయణవనం సింగిల్ విండో ప్రెసిడెంట్!

Tags: Attacked for questioning

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *