ఢిల్లీ సీఎంపై కారప్పొడి పొట్లంతో దాడి

Date:20/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఒక యువకుడు  అనూహ్యంగా దాడి దిగాడు. సాక్షాత్తూ సచివాలయంలోనే ఈ దాడి జరిగింది. పావుకేజీ కారప్పొడి పొట్లంతో అనిల్ కుమార్ శర్మ అనే వ్యక్తి సచివాలయంలోకి దూసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. భోజనం సమయం కావడంతో ముఖ్యమంత్రి తన గదిలో నుంచి బయటికి వస్తుండగా ఆయనపై కారం జల్లినట్టు వెల్లడించారు. సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో  కేజ్రీవాల్ కళ్లజోడు పగిలిపోయింది. నిందితుడు అనిల్ కుమార్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అనిల్ కుమార్ భార్య సెక్రటేరియట్లోనే పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. కాగా అతడు సీఎంపై ఎందుకు దాడికి దిగాడన్నది ఇంకా తెలియరాలేదు.
Tags:Attacked with karpapi powder on Delhi serum

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *