దాడులు చేస్తున్నారు

Date:04/04/2019
అమరావతి ముచ్చట్లు:
దేశంలో దుర్మార్గులంతా ఏకమయ్యారని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు అన్నారు.గురువారం  పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ… ప్రత్యర్థులపై కక్ష సాధించే లక్ష్యంగా ఏకమయ్యారన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ లు ఏపీపై ముప్పేట దాడులు చేస్తున్నారన్నారు. మోడీ డైరెక్షన్ తోనే టీడీపీ నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలపై పాత కేసులను కేసీఆర్  తవ్వితోడున్నారన్నారు. మరోవైపు ఐటీ దాడులతో భయాందోళనలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మైలవరంలో ఏకంగా పోలీసులపై కూడా దాడులకు తెగబడుతున్నారన్నారు.  ఇక ప్రజలపై వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. యుద్ధంలో కనీస సంప్రదాయాలు పాటిస్తారనీ, ఓటమి భయంతో వైసీపీ అన్నింటిని వదిలేసిందని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నేతల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు.  వీళ్ల దుర్మార్గాలతో తరతరాల అభివృద్ధి ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు పీకేస్తామని పుంగనూరులో బెదిరింపులకు పాల్పడ్డారని గుర్తుచేశారు. పొన్నూరులోనైతే స్కూల్ పిల్లల ఆటోపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారని గుర్తు చేసారు.  మైలవరంలో వైసీపీ నేతలు రణరంగం సృష్టించారని దుయ్యబట్టారు. పోలీసులు, జవాన్లపై చెప్పులు, రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సత్తా ఏంటో మోదీకి కూడా రుచి చూపించాలన్నారు.
Tags: Attacks are being done

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *