దాడులతో అణచలేరు

Attacks are not suppressed

Attacks are not suppressed

Date:12/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ప్రధాని మోడి అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ చేయని విధంగా అంధ్రప్రదేశ్ లోని టీడీపీ నాయకులపై ఐటీ దాడులు చెస్తుంది. ఈ దాడులతో  తెలుగు దేశం పార్టీ ని అణచలేరని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. శుక్రవారం నాడు అయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన తరువాత కక్షపూరితంగానే ఈ ఐటీ దాడులు చేస్తున్నారు. మస్తాన్ రావు, సీఎం రమేశ్ ల నివాసాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న సీఎం రమేశ్ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయడానికే ఈ దాడులని అయన అన్నారు. కరెన్సీ రద్దు తరువాత ఎందుకు ఫెక్ కరెన్సీ, కౌంటర్ పిట్  కరెన్సీ వివరాలు ఎందుకు ప్రజలకు వెల్లడించడం లెదని అయన అన్నారు. ఈ దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ దాడులతో దేశం పైన మోడి సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నాడు. రాఫెల్ కుంభకోణంతో దేశ ఆర్ధిక వ్యవస్థ నష్టపోయింది. జగన్ మెహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ రాపెల్ కుంభకోణంపై ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.  వారిద్దరూ బీజేపి కి అమ్ముడుపోయారని విమర్శించారు.
Tags:Attacks are not suppressed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *