కశ్మీర్‌లో దాడులు గణనీయంగా తగ్గాయి

Attacks in Kashmir have dropped significantly

Attacks in Kashmir have dropped significantly

Date:20/11/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, పరిణామాలు గురించి లోక్‌సభలో కేంద్రం ప్రకటించింది. ఆగస్టు 5 తర్వాత జరిగిన వేర్వేరు ఘటనల్లో 760 మంది అదుపులోకి తీసుకున్నామని, పాక్ 950 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి  వెల్లడించారు. మొత్తం 190 రాళ్లు దాడులు, శాంతి భద్రతల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు. ఆగస్టు 5 నుంచి నవంబరు 15 మధ్య 765 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అంతేకాదు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో రాళ్ల దాడులు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఈ దాడులను నివారించడానికి వివిధ అంశాలను ప్రభుత్వం అనుసరిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు.రాళ్ల దాడులకు ప్రేరేపించేవారిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను పెద్ద సంఖ్యలో గుర్తించి, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. కశ్మీర్‌ లోయలో రాళ్లు రువ్వడం, మూక దాడులు వెనుక హురియత్ లాంటి వేర్పాటువాద సంస్థలు, తిరుగుబాటుదార్లు ఉన్నట్టు విచారణలో తేలిందని కేంద్ర మంత్రి తెలిపారు. గతంలో ఉగ్రవాదులకు నిధులు అందజేశారనే ఆరోపణలతో 18 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జ్‌షీట్ దాఖలుచేసిందని కిషన్ రెడ్డి అన్నారు.ఆగస్టు నుంచి అక్టోబరు మధ్య పాకిస్థాన్ సైన్యం కాల్పుల ఒప్పంద విరమణను అతిక్రమించి 950 సార్లు ఉల్లంఘనలకు పాల్పడిందని తెలిపారు. వీటిని భారత్ సైన్యం సమర్ధంగా తిప్పికొట్టిందని చెప్పారు. భారతదేశానికి వ్యతిరేకంగా సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ను భారత్ పదేపదే హెచ్చరిస్తోందని కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు.జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న ఆర్టికల్ 370, 35ఏలను ఆగస్టు 5న రద్దుచేసిన కేంద్రం, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. దీంతో లోయలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలను చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు యత్నించగా, వాటిని సైన్యం తిప్పికొట్టింది. గత మూడు నెలలుగా లోయలో భారీగా బలగాలు మోహరించి ఉన్నాయి.

 

గర్భిణీ స్త్రీలకు “స్వైన్ ఫ్లూ వ్యాధి -ముందస్తు జాగ్రత్తలు” పై అవగాహన

 

Tags:Attacks in Kashmir have dropped significantly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *