గుట్కా కేంద్రాలపై దాడులు

మహబూబ్ నగర్ ముచ్చట్లు:
మహబూబ్ నగర్ జిల్లాలో గుట్కా కేంద్రాలపై పోలీసులు భారీగా దాడులు నిర్వహించారు. తాజాగా గురువారం నాడు భూత్పూరు మండల కేంద్రంలో భారీ ఎత్తున నిషేదిత గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. .సి ఐ రజిత రెడ్డి  ఆదేశాల మేరకు ఎస్సై భాస్కర్ రెడ్డి అధర్వంలో  కానిస్టేబుల్ వెంకటేష్,విష్ణు  మండల కేంద్రంలోని కిరాణా షాపులో గుట్కా అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించగా లక్ష్మీ ప్రసన్న కిరాణ దుకాణంలో 50 వేల విలువ గుట్కాలు లభించాయి.వీటిని  స్వాధీనం చేసుకుని షాప్ యజమాని  ప్రతాప్ ని విచారించగా జడ్చర్ల నందు మార్వది గణేష్ అనే వ్యక్తి సప్లై చేస్తున్నాడని తెలిసి అతని స్థావరం పై రైడ్ చేయగా 5,98000 విలువ గల గుట్కా ప్యాకెట్లు దొరికాయి. నిందితుడు గణేష్, అతని సోదరుడు లను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశామని గుట్కాలు ఎవరైన అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రజిత రెడ్డి మీడియాకు తెలిపారు…

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Attacks on gutka centers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *