పుంగనూరులో సారా తయారీ బట్టీలపై దాడులు

పుంగనూరు ముచ్చట్లు:

సారా బట్టీలపై పోలీసులు దాడులు చేసి , సారా ఊట ధ్వంసం చేసి విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. సీఐ రాఘవరెడ్డి కథనం మేరకు ఎస్‌ఐలు సుబ్బారెడ్డి, మహమ్మద్‌రఫితో కలసి మండలంలోని నల్లగుట్లపల్లెతాండలో దాడులు చేశారు. ఈ సందర్భంగా సుమారు వెయ్యి లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. అలాగే ఇందుకు సంబంధించిన వస్తువులను సీజ్‌ చేసినట్లు తెలిపారు. సుమారు రూ.1.50 లక్షలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ మాట్లాడుతూ సారా తయారీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ మధ్యం వ్యాపారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

 

Tags:Attacks on sara manufacturing kilns in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *