సారా స్థావరాలపై దాడులు
మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె రూరల్ మండలం సిటియం గ్రామ సమీపంలోని చెరువుకట్ట కింద భాగంలో నాటుసారా తయారీ స్థావరాన్ని సెబ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తమకు వచ్చిన విశ్వసనీయమైన సమాచారం మేరకు మదనపల్లె సెబ్ ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ శ్రీహరిరెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో BMPP ఎస్ఐ రాజశేఖర్, సిబ్బందితో కలిసి సిటియం చెరువు కట్ట సమీపంలో ఉన్న నాటుసారా తయారీ స్థావరాన్ని కనుగొని ధ్వంసం చేశారు. ఈ దాడిలో 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ స్థావరాన్ని నడిపిస్తున్న పాలెంకొండ గ్రామానికి చెందిన గల్లా రవికుమార్ పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
Tags: Attacks on Sarah’s bases

