టీడీపీ నేతల ఇళ్లపై దాడులు

Date:23/02/2021

ఆదోని  ముచ్చట్లు:

కర్నూలు జిల్లా ఆదోని మండలం లోని 104 బసాపురం గ్రామంలో టిడిపి వర్గీయుల ఇంటిపై వైసిపి నాయకులు కార్యకర్తలు దాడి చేసినట్లు కేసు నమోదయింది. ఈ దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయని సమాచారం. టిడిపి తరఫున గెలిచిన  సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి, టిడిపి అభ్యర్థిని బలపరిచిన రామస్వామి ఇండ్ల పై రాత్రి ఒంటిగంట ప్రాంతం లో వైసిపి నాయకులు కార్యకర్తలు  వందమంది దాకా వారి ఇళ్ల పై కట్టెలు, రాళ్లు తో దాడి చేసారని బాధితులు తెలిపారు.  సమయానికి గ్రామంలోకి వచ్చిన  పోలీసులు వారిని ఎంత సర్దుబాటు చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దాంతో  ఎస్ ఐ విజయలక్ష్మి డి.ఎస్.పి వినోద్ కుమార్  తో మాట్లాడి ఎక్కువ మందిని పోలీసులు తీసుకెళ్ళి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags;Attacks on TDP leaders’ homes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *