ఆలయాలపై దాడులు….కేంద్రమంత్రి అమిత్ షా కు వినతి పత్రం

Date:18/09/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు

ఎపి లో ఆలయాలపై దాడులను వివరిస్తూ  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు, సి.ఎం.రమేష్ శుక్రవారం వినతి పత్రం సమర్పించారు.  తరువాత వారిద్దరూ మీడియాతో మాట్లాడారు.  కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.  హిందూ దేవతలను అపవిత్రం చేసిన అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి.  అంతర్వేదిలోని పురాతన శ్రీ లక్ష్మి నరసింహ ఆలయానికి చెందిన 62 ఏళ్ల రథాన్ని తగలబెట్టారు. విజయవాడలోని  కనక దుర్గా ఆలయం వెండి రధం పై వెండి సింహాల విగ్రహాలు అదృశ్యం అయ్యాయి. మొత్తం మీద ఇలాంటి 18 సంఘటనలు ఎపి లో జరిగాయి.   ఎపి లో ఘటనలు  హిందువుల మతపరమైన భావాలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి.  హిందూ మనోభావాలతో సంబంధం ఉన్న ఈ కేసులను విచారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన తీవ్రతను చూపించలేదని అన్నారు.  అంతర్వేదిలో కొంతమంది దుండగులు చర్చిపై రాళ్ళు రువ్వారని కేసులు పెట్టారు. అంతర్వేదిలో దహనంపై శాంతియుత నిరసన చేపడితే అరెస్టు లు చేశారు.

 

41 మంది హిందూ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడానికి ప్రభుత్వమే  చర్చిని రాళ్ళతో కొట్టే సంఘటనను ఉపయోగించింది.   ప్రతీకారంగా వ్యవహరిస్తున్న ఈ 41 మందిని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేసి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.   రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఈ ఘటనల తో అర్ధమవుతుంది. వీరి పై ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బిజెపి ఈ రోజు అమలాపురంలో శాంతియుతంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చింది.  గుంటూరులో నిందితులుగా ఉన్న కొంతమంది ముస్లింలపై వైసిపి ప్రభుత్వం ఇటీవల ఎఫ్ఐఆర్ రద్దు చేసింది.  అయినప్పటికీ ఒక పోలీస్ స్టేషన్ పై దాడి చేసి, వారిపై సాక్ష్యాల ను స్వాధీనం చేసుకుంది. గుంటూరు సంఘటనలో కొంతమంది ముస్లిం యువకులు పోలీసు స్టేషను పైదాడి చేసినట్లు ఆధారాలు ఉన్నా..ఈ ప్రభుత్వం  ఎఫ్ఐఆర్  ను కొట్టేసింది. చర్చి పై నాలుగు రాళ్లు వేశారనే అభియోగంతో41మందిని అరెస్ట్ చేశారు. ముస్లిం, క్రిస్టియన్ ల పట్ల బుజ్జగింపు చర్యలు, హిందువుల పట్ల కేసులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అమిత్ షా కు ఇచ్చిన లేఖలో వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అనుసరించడానికి వీలు లేదని కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని అయన అన్నారు. అన్ని మతాలకు సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి..  వైసిపి ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక విధానాల పట్ల కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరాం. ఎపి లో జరుగుతున్న వరుస ఘటనలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ను మీరు పరిశీలించాలని ఈ వినతి పత్రాన్ని అందచేశానమని అన్నారు.

 

అధికార పార్టీకి చట్టాలు వర్తించవా 

Tags:Attacks on temples… .Petition to Union Minister Amit Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *