అట్టహాసంగా గన్నెల పంచాయతీ గ్రామ సభ

విశాఖపట్నం ముచ్చట్లు:
 
అరకులోయ  మండలంలో గల గన్నెల పంచాయతీ కేంద్రంలో స్థానిక సర్పంచ్ బి. బి.బొజ్జ అధ్యక్షతన జరిగిన గ్రామ సభ అట్టహాసంగా నిర్వహించారు.ముందుగా గ్రామ సభలో విచ్చేసిన అందరిని నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ కార్యదర్శి రాజేంద్ర కుమార్  శాఖల వారీగా  సమీక్షలు నిర్వహించి గతంలో జరిగిన పనుల అభివృద్ధి గురించి చదివి క్లూప్తంగా వివరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ సభ ప్రతి ఏటా నాలుగు దఫాలుగా ప్రతి పంచాయతీలో నిర్వహించబడుతుంది.ఇటువంటి గ్రామ సభలో మన ఒక పంచాయితీ పరిధిలో ఉన్న గ్రామల సమస్యలు గాని,వారి వారి వ్యక్తిగత సమస్యలు గాని వార్డు సభ్యులు,గ్రామ వాలంటీర్లు, గుర్తించి నేరుగా గ్రామ సభలో సమస్యలు దరఖాస్తు రూపంలో సంబంధిత శాఖల వారికి ఇవ్వొచ్చునారు.ఈ యొక్క సమస్యలను పంచాయితీలో ఆమోదించి సంబంధిత శాఖల వారికి దాఖలు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిలుగా జెడ్పిటిసి సభ్యురాలు శెట్టి రోషిణి  ఎంపీటీసీ సభ్యురాలు బి.లలిత దేవి పాల్గొన్నారు.పలువురు  మాట్లాడుతూ గ్రామ సభలో ప్రజలు పాల్గొనడం వలన సమస్యలు,పరిష్కార మార్గాలు తెలుసుకుని జవాబుదారితనం పెరుగుతుందన్నారు. పంచాయతీల గ్రామాలలో ఎటువంటి సమస్య ఉన్న మా దృష్టికి తీసుకువస్తే స్థానిక ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ దృష్టికి తీసుకెళ్లి అయ్యా సమస్యను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం నేచర్ సంస్థ మండల కో ఆర్డినేటర్ టి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ సంస్థ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి గుప్తంగా వివరించారు.అనంతరం నూతనంగా మంజూరైన వైయస్సార్ పింఛన్లను 5 మంది లబ్ధిదారులకు 2500 రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి ఎస్.టి సెల్ అధ్యక్షులు  కె.అశోక్,వైస్ సర్పంచ్ చిన్నారావు,వార్డు సభ్యులు కె. అశ్విన్ కుమార్  సచివాలయం సిబ్బంది నేచర్ సంస్థ సిబ్బంది మన్మధరావు చలం గ్రామస్తులు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Attahasanga Gannela Panchayat Gram Sabha

Natyam ad