Date:03/12/2020
మెదక్ ముచ్చట్లు:
మత్స్యకారుల ముఖాల్లో చిరునవ్వులు చూడడమే ప్రభుత్వ లక్ష్యమని.. జలాశయాల్లో పెద్ద ఎత్తున చేపపిల్లలను విడుదల చేయడం ద్వారా మత్స్యకారులకు సుస్థిర ఆదాయం చేకూరుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లాలోని చిన్నకోడూరు మండలంలోని రంగనాయకసాగర్‌లో మంత్రి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చెరువుల్లో చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధి ద్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపపిల్లలను ఉచితంగా వదులుతున్నట్లు తెలిపారు. రంగనాయకసాగర్ జలాశయం 877 హెక్టార్ల వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉందన్నారు. అదే విధంగా కొండపోచమ్మసాగర్ 1908 హెక్టార్లు, ఐనాపూర్ ప్రాజెక్టు 119 హెక్టార్ల వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉందన్నారు. వీటికి తోడు జిల్లాలో 1347 చెరువులు ఉన్నాయన్నారు. వీటిలో ఇప్పటి వరకు 100 శాతం రాయితీతో 3 కోట్ల 57 లక్షల 32 వేల చేపపిల్లలను విడుదల చేశామన్నారు. రంగనాయకసాగర్లోనే ఇప్పటి వరకు 13 లక్షల 20 వేల చేపపిల్లలు విడుదల చేశామన్నారు. చేపపిల్లలతో పాటు మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న రొయ్య పిల్లలను సైతం జలాశయాల్లో విడుదల చేస్తున్నామన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, వలలు, మొబైల్ ఫిష్ ఔట్లెట్, సంచార ఫిష్ వెండింగ్ కియోస్క్, కేట్స్ వంటికి అందించామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మీల్‌ఖాన్, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.
పుంగనూరు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు
Tags: Attempt for a steady income for fishermen