కాంగ్రెస్ నేతపై దాడికి యత్నం

Date:28/10/2020

కోరుట్ల ముచ్చట్లు:

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులపై వరుస దాడులు జరుగుతున్నాయి. దాంతో  కాంగ్రెస్ కార్యకర్తలు భయందోళనలో వున్నారు.  నాలుగు రోజుల క్రితమే కోరుట్ల నియోజకవర్గం మెట్ పెళ్లి మండలం వెంట్రావ్ పెట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  కొమిరెడ్డి లింగారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి జరిపారు. అయన  తీవ్రగాయలతో హాస్పిటల్లో చేరారు. ఆ సంఘటన మరువక ముందే మంగళవారం ఆర్ధ  రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్   ఇంటి గేటు బద్దలు కొట్టి ఇంటిలోకి ప్రవేశించి అతనిపై హత్య ప్రయత్నం చేసారు.  అప్రమత్తమై  గంగాధర్ వారిని పట్టుకొని పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి నిందితున్ని తీసుకు వెళ్లారు. బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

సమిశ్రగూడెంలో ఎమ్మెల్యే పర్యటన

Tags: Attempt to attack Congress leader

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *