Natyam ad

పుంగనూరులో అన్నపై తమ్ముడు హత్యాప్రయత్నం

పుంగనూరు ముచ్చట్లు:

ఆస్తి తగాదాల కారణంగా స్వయాన అన్నపై తమ్ముడు వేటకొడవలితో హత్యప్రయత్నం చేసిన సంఘటన మండలంలోని గుమ్మడికాలువ వద్ద శనివారం జరిగింది. అరవవాండ్లపల్లికి చెందిన నాగరాజు , ప్రేమ్‌కుమార్‌ లు అన్నదమ్ములు . వీరికి పొలం వద్ద నీటి సమస్య రావడంతో ప్రేమ్‌కుమార్‌ రెచ్చపోయి వేటకొడవలితో అన్నను హతమార్చేందుకు దాడి చేశాడు. దాడి సమయంలో నాగరాజు ఎడమచెయ్యి అడ్డంపెట్టడంతో వేటకోడవలితో రెండు సార్లు చేతిపై నరికాడు. తీవ్ర రక్తగాయాలైంది. వెంటనే ఆప్రాంత వాసులు నాగరాజును కాపాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రేమ్‌కుమార్‌ పలుమార్లు ఇలాంటి దాడులు చేసినట్లు , పోలీసులు కేసులు నమోదు చేసినట్లు నాగరాజు తెలిపారు.

 

Post Midle

Tags; Attempted murder by younger brother in Punganur

Post Midle