Natyam ad

పెద్దమండ్యంలో యువకుని పై హత్యాయత్నం

పెద్దమండ్యం ముచ్చట్లు:

పెద్దమండెంలో యువకునిపై హత్యాయత్నం జరిగడం ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం.. మండలంలోని బురుజు కురప్పల్లికి చెందిన రైతు ఆదినారాయణ పొలంలో టమాటాలు చోరీ జరిగాయి. దీంతో బాధిత రైతు బాధతో ఆ రోజు లక్ష్మీపతి ఊర్లో ఉన్నాడా.. లేడా..? అంటూ గ్రామస్తులను విచారించాడు. టమాటాలు చోరీ చేయక పోయినా ఊర్లో పరువు తీసాడని రైతుతో లక్ష్మిపతి గొడవపడటం తెలుసుకొన్న గెలసంవారిపల్లిలో వుండే శ్రీకాంత్ మా పెదనాన్నతో ఎందుకు గొడవ పడ్డావని లక్ష్మీపతిని రాత్రి నీలదీశాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి లక్ష్మిపాటిని శ్రీకాంత్ కత్తితో పొడచాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితున్ని స్థానికులు వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రధమ చికిత్సల అనంతరం అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రి కి తరలించారు. ప్రస్తుతం బాధితుని ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

 

Post Midle

Tags: Attempted murder of a youth in Oedmandyam

Post Midle