తండ్రి కొడుకు  పై హత్యాయత్నం-ఇద్దరిపై కత్తితో దాడి

-కడప కు తరలింపు

బద్వేలు ముచ్చట్లు:

బద్వేలు పట్టణం ఆరోగ్యపురంగా బుధవారం ఉదయం తండ్రీకొడుకులపై హత్యా ప్రయత్నం జరిగింది తీవ్రంగా గాయపడిన వారు ప్రస్తుతం కడపలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆరోగ్య పురంలో నివాసం ఉంటున్న ప్రైవేటు టీచర్ కొండా శేషాద్రి రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పై ఈ హత్య ప్రయత్నం జరిగింది.  బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న శేషాద్రి రెడ్డి అతని కుమారుడు కార్తీక్ రెడ్డి పై పోలేరు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.  పోలేరు శేషాద్రి రెడ్డి ఇంటికి దగ్గరలోనే గత రెండు సంవత్సరాలుగా తల్లి చెల్లి తో కలిసి నివాసం ఉంటున్నాడు కాశి నాయన మండలం గంగనపల్లె గ్రామానికి చెందిన పోలేరు గత కొంతకాలంగా బెంగళూరు తదితర ప్రాంతాల్లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు.  ఇటీవలే పోలేరు బద్వేలు కు రావడం జరిగింది స్పష్టమైన కారణాల కోసం పోలీసులు పోలేరు ను తమ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు సంఘటన జరిగిన కేవలం రెండు గంటల వ్యవధిలోనే అర్బన్ ఎస్సై కత్తి వెంకటరమణ అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.  అతన్ని అన్ని విధాల విచారణ చేస్తున్నారు. కాగా తండ్రీకొడుకులపై జరిగిన హత్యాయత్నంపై స్పష్టమైన కారణాలు తెలియడం లేదు జరిగిన సంఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు అర్బన్ ఎస్సై కత్తి వెంకటరమణ తెలిపారు.

 

Tags: Attempted murder of father and son – both attacked with a knife

Leave A Reply

Your email address will not be published.