కనిగిరిలో అత్యాచారయత్నం

Date:05/12/2019

ఒంగోలు ముచ్చట్లు:

ఒంటరిగా ఉన్న మహిళల పట్ల కామాంధులు ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఇటీవల దిశాపై జరిగిన అమానుష ఘటన మరువక ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాల పర్వం ఎక్కువవుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసిన కిషోర్ అనే యువకుడు ఆమెను అత్యాచారం చేయబోయాడు. ఆ మహిళ గట్టిగా ప్రతిఘటించడంతో, మహిళలపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. మహిళ గొంతుపై కత్తితో గాయం చెయ్యడంతో  మహిళ ఒక్కసారిగా షాక్కు గురై పడిపోవడంతో ఆమెను స్థానికులు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.  వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు , మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చర్చించుకుంటున్నారో, ఆ యువకుడు కిషోర్ అయ్యప్ప మాల ధరించి ఉండటం గమనార్హం..నిందితుడు మానసిక పరిస్థితి బాగోలేదని స్థాయినికులు చెప్తున్నారు.

 

చంద్రబాబుని ప్రశ్నించని పవన్ కళ్యాణ్

 

Tags:Attempted rape in Kanigiri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *