Natyam ad

పుంగనూరులో  మైనర్ బాలికపై అత్యాచారయత్నం

– తాగిన మత్తులో దారుణానికి ఒడిగట్టిన యువకులు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

తాగిన మత్తులో ఇద్దరు యువకులు ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని పంచాయతీ కేంద్రమైన మంగళం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గురువారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన మరి కొందరితో కలసి గ్రామ శివారులో మధ్యం సేవించారు. మధ్యం సేవించిన మిత్రులు వారి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఇద్దరు యువకులు మాత్రం గ్రామ శివారు ప్రాంతంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళం గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక పొలం వద్ద గడ్డి తీసుకురావడానికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన యువకులు మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే మైనర్ బాలిక ప్రతిఘటించడంతో బాలికపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు వస్తారని భావించి ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. మైనర్ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం తెలుసింది. ఇందులో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, మరో ముద్దాయి పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

Tags: Attempted rape of a minor girl in Punganur

Post Midle