మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆర్.ఎమ్.పి డాక్టర్ ఓ గిరిజన మహిళ పై అత్యాచారయత్నం

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం గ్రామంలోని ఓ ఆర్.ఎమ్.పి డాక్టర్ ఓ గిరిజన మహిళపై అత్యాచారయత్ననికి  పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే అనంతసాగరం గ్రామానికి చెందినా ఓ గిరిజన వివాహిత మహిళ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వెళ్తే తనకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి తన పై అత్యాచారయత్ననికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నీరసంగా ఉండడంతో వైద్యం కోసం బుధవారం తమ భర్తతో కలిసి ఆర్.ఎమ్.పి వైద్యుడు తుపాకుల సుభ్రమణ్యం దగ్గరకు వెళ్ళింది.బీపి తగ్గిందని మందులు రాసి ఇచ్చాడు అయితే మహిళ  భర్త మందుల కోసం వెళ్ళగా ఇంతలో డాక్టర్ ఓ ఇంజక్షన్ ఇవ్వడంతో సృహ తప్పినట్లు అనిపించిందాని ఆ సమయంలో ఆ మహిళ ను పట్టుకొని అత్యాచారయత్నం చేసినట్లు వాపోయింది.బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్ ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Attempted rape of RMP doctor O tribal woman by injection of drugs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *