ధర్డ్ వేవ్ కట్టడికి యత్నాలు

విజయవాడ ముచ్చట్లు :

కొవిడ్‌ మూడో వేవ్‌ వస్తుందన్న ఊహగానాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధతపై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. చిన్నారుల కోసం రాష్ట్రంలో 3 కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విశాఖ, తిరుపతి, విజయవాడ-గుంటూర్‌లో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో దవాఖానకు రూ. 180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. అన్ని బోధనా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, కరోనా మూడో వేవ్‌పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పిల్లల్లో లక్షణాలు గుర్తించేందుకు ఆశావర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. చిన్నారులకు పోషకాహార పంపిణీ, టీకాల కార్యక్రమం కొనసాగించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Attempts to build a third wave

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *