Natyam ad

జగన్‌ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై – మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశంకు చెందిన 20 కుటుంబాల వారు శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పులిచెర్లలో సిద్ధం ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ ఆధ్వర్యంలో మండలంలోని భరిణేపల్లె గ్రామానికి చెందిన చందు యాదవ్‌, మంజునాథ్‌, పురుషోత్తం, సురేష్‌, బాలాజి, రాజేంద్రనాథ్‌, మురుగేష్‌, గోవిందు తదితరులు పార్టీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి వీరందరికి పార్టీ కండువాలు కప్పి ,పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల పంపిణీలో పేదరికమే ప్రామానికంగా పథకాలు అందించిన ఆదర్శ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీకి రెండు ఓట్లు వేసి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి , నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Attracted to Jagan’s welfare programs – Minister Peddireddy

Post Midle