9న వాహనాలు వేలం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన 7 వాహనాలను ఈనెల 9న వేలం వేయనున్నట్లు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వ్యాపారులు వేలంపాటలో రూ.5 వేలు ధరావత్తు చెల్లించి పాల్గొనాలని కోరారు.

Tags: Auction of vehicles on 9
