Natyam ad

శ్రీ శైలంలో ఆడియో లీక్… మంత్రి ఆగ్రహం

శ్రీశైలం ముచ్చట్లు:

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం లీక్‌ అయిన ఓ ఆడియో కలకలం సృష్టిస్తోంది.. అభిషేకాలు అమ్మకానికి పెట్టారు ట్రస్ట్ బోర్డులో ఓ మహిళా సభ్యురాలు.. పీఏతో బేరసారాలపై మాట్లాడిన ఆడియో అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఆడియో వైరల్‌గా మారిపోయింది.. మల్లికార్జునస్వామికి అభిషేకాలు, స్పర్శ దర్శనాల పేరుతో దోపిడీ చేయడమే ప్లాన్‌గా ఈ వ్యవహారం నడుస్తోంది.. స్వామివారి గర్భాలయ అభిషేకం టికెట్లు లేకపోయినా.. గర్భాలయ అభిషేకాలు చేయిస్తామంటున్న ధర్మకర్తల మండలిలోని ఓ సభ్యురాలు ఆ ఆడియోలో చెబుతున్నారు.. గర్భాలయ అభిషేకాలు టికెట్లు లేకుండా.. గర్భాలయ అభిషేకాలు చేయించుకునే భక్తులు ఎవరైన ఉంటే పార్టీలను పట్టుకురా.. అంటూ ఆ సభ్యురాలు మధ్యవర్తులతో సంభాషించినట్టు ఆ ఆడియోలో ఉంది.. మల్లికార్జునస్వామి దర్శనాల పేరుతో దళారుల దందా మధ్యవర్తులతో ట్రస్ట్ బోర్డ్ లోని ఓ సభ్యురాలు భక్తులకు ఎర వేయడం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.అయితే, శ్రీశైలం క్షేత్రంలో జరుగుతోన్న ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పశ్చిమగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆడియో కలకలంపై స్పందించారు.. దైవ దర్శనాలు, అభిషేకాల పేరుతో డబ్బు సంపాదించుకోవాలని చూడటాన్ని సహించబోమని హెచ్చరించారు.. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మజ మాట్లాడినట్టుగా ఆడియోలో తెలుస్తుందన్నారు.. అభిషేకాలకు డబ్బులు డిమాండ్ చేయడం సరైన పద్ధతి కాదని సూచించారు.. ఈ ఘటనపై విచారణ కమిటీ వేసి నిజా నిజాలు పరిశీలిస్తాం. తప్పు చేసినట్టు తేలితే ట్రస్ట్ బోర్డు నుంచి తొలగిస్తామని ప్రకటించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

 

Tags; Audio leak in Shree Sailam… Minister angry

Post Midle
Post Midle