తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాబు ఏరియల్ సర్వే

Aurial Survey on Babu affected areas

Aurial Survey on Babu affected areas

Date:12/10/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే.. బాధితులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా.. సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సీఎం.తిత్లీ తుఫాన్‌తో వణికిపోయిన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వర్షాలు తగ్గముఖం పట్టడంతో.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా రంగంలోకి దిగారు. జిల్లాలో పర్యటిస్తున్నసీఎం.. హెలికాప్టర్ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పలాస, కాశీబుగ్గ, ఉద్ధానంతో పాటూ మరికొన్ని ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆపద వచ్చిందని.. సహాయక చర్యలు, పునరావాసం కోసం అందరూ కదలాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.
తుఫాన్ ధాటికి ధ్వంసమైన రోడ్లను మరమ్మతులు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాతో పాటూ సమాచార వ్యవస్థ దెబ్బతిందని.. వాటిని పునరుద్ధరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని సూచించారు. జిల్లాలా సాధారణ పరిస్థితులు వచ్చే వరకు అధికారులకు సెలవులు రద్దు చేశారు. ప్రతి మండలానికి ఓ సబ్ కలెక్టర్‌కు సహాయక చర్యల బాధత్యలు అప్పగించారు సీఎం. అలాగే పంటనష్టం, ఆస్తినష్టంపై అంచనాలను రూపొందించాలన్నారు.
అధికారులతో సమీక్ష తర్వాత.. సీఎం కవిటి, సోంపేట, కాశీబుగ్గ, పలాసలలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. తుఫాన్ బాధితుల ఇబ్బందుల్ని, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై సీఎం ఆరా తీశారు. ఇటు మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, ఎంపీ రామ్మోహన్ నాయుడులు కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలతో పాటూ తుఫాన్ బాధితులకు సౌకర్యాలపై దృష్టి పెట్టారు.
Tags:Aurial Survey on Babu affected areas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *