శ్రీ బోయకొండ గంగమ్మ సేవలో అరబిందో ఫార్మసీ ఎండి కె. నిత్యానంద రెడ్డి, కె. రాజేశ్వరి దంపతులు
చౌడేపల్లి ముచ్చట్లు :
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం అరబిందో ఫార్మసీ ఎండి కె. నిత్యానంద రెడ్డి, కె. రాజేశ్వరి దంపతులు వారి కుటుంబ సభ్యులు బోయకొండ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ పాలకమండలి చైర్మన్ మిద్దింటీ శంకరనారాయణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఏదో పండితుల ఆశీర్వాదం తో ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పెద్ద కొండా మారి ప్రభాకర్ రెడ్డి హేమంత్ రాజు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: Aurobindo Pharmacy MD K. Nithyananda Reddy and K. Rajeshwari couple at Sri Boyakonda Gangamma Seva
