ఆసీస్ కు టీమిండియా

Australia to Aussies

Australia to Aussies

Date:16/11/2018
ముంబై ముచ్చట్లు:
ఆస్ట్రేలియా గడ్డపై అందని ద్రాక్షగా మిగిలిపోయిన టెస్టు సిరీస్‌ని కైవసం చేసుకునేందుకు భారత్ జట్టు‌కి ఇదే తగిన సమయమని ఆ దేశ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, నాలుగు టెస్టులతో పాటు మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడేందుకు భారత్ జట్టు చేరుకుంది. ఈనెల 21న తొలి టీ20తో సిరీస్ ప్రారంభంకానుండగా.. డిసెంబరు 6 నుంచి టెస్టు సిరీస్‌ మొదలుకానుంది. అయితే.. ఓపెనర్ డేవిడ్ వార్నర్, మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ నిషేధం కారణంగా ఆస్ట్రేలియా జట్టుకి దూరమవడం, ఇటీవల ఆ జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో ఆ గడ్డపై ఇప్పుడు భారత్ జట్టు టెస్టు సిరీస్‌ని గెలవలేకపోతే ఆశ్చర్చపోవాల్సి వస్తుందని జోన్స్ చెప్పుకొచ్చాడు. ‘భారత్ జట్టు‌‌కి ఇదే మంచి అవకాశం. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు టెస్టు సిరీస్‌ని గెలవలేకపోయింది. కానీ.. తాజా పర్యటనలో సిరీస్‌ని గెలవలేకపోతే అది ఆశ్చర్యమే. పర్యటనలో అశ్విన్ కీలకమవుతాడని నా అంచనా. అతనితో పాటు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని ఎదుర్కోవడం టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కి సవాలే. అయితే.. అరోన్ ఫించ్, హ్యాండ్స్‌కబ్ స్పిన్‌‌ని బాగా ఆడగలరు. కానీ.. సిరీస్‌లో భారత్ స్పిన్నర్లకి ఎంతమేర పోటీనిస్తారో..? చూడాలి’ అని డీన్ జోన్స్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2016లో ఆఖరిసారి పర్యటించిన భారత్ జట్టు ఐదు వన్డేల సిరీస్‌ని 1-4తో చేజార్చుకున్నా.. మూడు టీ20ల సిరీస్‌ని మాత్రం 3-0తో గెలిచింది. ఆ సిరీస్‌లో టెస్టులు లేవు.
Tags:Australia to Aussies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *