తప్పి పోయిన బాలుడిని తల్లి ఒడికి చేర్చిన అధికారులు

Date:17/10/2020

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయిన అబ్బాయిని గంటల్లోనే పట్టుకుని తల్లికి అప్పగించిన సంఘటన స్థానిక లక్ష్మీ పేటలో చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు,సచివాలయ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం  శనివారం ఉదయం లక్ష్మిపేటకు చెందిన 3 సంవత్సరాల బాలుడు ఇంటిముందు ఆడుకుంటూ కనిపించకుండా వెళ్ళిపోయాడు. బాలుడు కనిపించక పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రలు చుట్టుపక్కల వెతికారు.అయిన బాలుడు కనిపించక పోవడంతో వెంటనే 26వ వార్డు సచివాలయం సిబ్బందికి, పోలీసులకు ఫోన్ చేసి విషమాన్ని తెలిపారు.తక్షణమే స్పంధించిన పట్టణపోలీసులు, శానిటరీ సిబ్బంది,సచివాలయం సిబ్బంది గంటల వ్యవధిలోనే బాబుని వెతికి,గుర్తించి 26వ వార్డు సచివాలయంలో తల్లికి అక్కున చేర్చారు.బాబుని చూసిన తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.గంటల వ్యవధిలోనే బాబుని వెతికి తల్లిదండ్రులకు అప్పగించిన 26వ సచివాలయ సిబ్బందిని,పోలీసు ఎస్సై వెంకటరాముడు మరియు పోలీసు సిబ్బందిని,శానిటరీ సిబ్బందిని బాబు తల్లిదండ్రులు, కాలనీవాసులు అభినందించారు. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై సూచించారు.

చిన్న‌శేష వాహ‌నంపై దామోద‌ర కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Tags: Authorities put the missing boy in the mother’s arms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *