ఆటో, కారు ఢీ…కూలీలకు తీవ్రగాయాలు
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొవూరుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో లోని ప్రయాణికులు కోనేటి పాలెం గ్రామానికి చెందిన కూలీలుగా సమాచారం. ఘటనలో గాయపడిన పలువురి పరిస్తితి విషమం గా వుంది. కావలి వైపు వెళ్తున్న ఆటోను కారు వెనక నుండి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు వున్నారు. ఆటోను ఢీకొన్న తరువాత కారు రోడ్డు పక్కనున్న పోలంలోకి దూసుకుపోయింది. క్షతగాత్రులను 108 సహాయంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.
Tags: Auto, car collision…laborers seriously injured