కాలువలో పడ్డ ఆటో…ఇద్దరికి గాయాలు

నెల్లూరు ముచ్చట్లు:
 
నెల్లూరు జిల్లా బుచ్చి- జొన్నవాడ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని పంచేడు నుండి కొడవలూరుకు వెళ్తున్న ఆటో సల్మాన్ పురం వద్ద రహదారి పక్కన ఉన్న పంట కాలువలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో తోలుతున్న నాగేంద్రతో పాటు ఆటో లోని మరో వ్యక్తి బద్రి కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందడంతో వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని ఇరువురిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వారు కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Auto crashed into a ditch, injuring two