ఆటో డ్రైవర్ దారుణ హత్య
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు నగరంలో సీతం కళాశాల వద్ద యువకుడి ని గొంతు కోసి హత్య చేసారు. మృతుడు బాలాజీ కాలనీ అంబేద్కర్ నగర్ కు చెందిన అన్నామలై కుమారుడు వడివేలుగా గుర్తించారు. వడివేలు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు . వడివేలుకు వివాహమై పిల్లలు లేరు. గతంలో వడివేలు అన్న బాబు కూడా గంగాధర నెల్లూరులో హత్యకు గురయ్యాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వడివేలు తిరిగి ఇంటికి రాలేదు. పలు కోణాల్లో తాలుకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Auto driver brutal murder

