-డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలి
-జగిత్యాల ట్రాఫిక్ ఎస్ ఐ అనిల్
Date:02/12/2020
జగిత్యాల ముచ్చట్లు:
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ అన్నారు. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు బుధవారం జగిత్యాల కొత్త బస్ స్టాండ్ వద్ద డిఎస్పీ వెంకటరమణ, టౌన్ సిఐ జయేష్ రెడ్డి ల ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.ఈసందర్బంగా అనిల్ మాట్లాడుతూ డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలన్నారు. ఆటోలు నిలువునప్పుడు పాటించే నిబంధనలు,వాహన పత్రాలు, పరిమితికి మించి ప్రయాణికులను చేరవేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి, డ్రైవర్స్ పక్కన ఇరువైపులా ఎవరు కూర్చోవద్దని, రెండు వైపులా స్లిట్లు తొలగించాలని సూచించారు. కచ్చితంగా డ్రైవర్ యూనిఫాం ధరించాలని, తదితర అంశాలపైఅనిల్ అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో జగిత్యాల కొత్త బస్ స్టాండ్ ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
Tags: Auto drivers must obey traffic regulations