Natyam ad

కూలీల ఆటో బోల్తా.. 9 మందికి తీవ్ర గాయాలు

ఒంగోలు ముచ్చట్లు:


ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం గ్రామసమీపంలో ఉపాధి కూలీలు వెళ్తున్న ఆటో బోల్తా పడ్డ సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రగాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని స్థానికులు 108 వాహనంలో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆటోలో మొత్తం 20 మంది కూలీలు ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags: Auto of laborers overturned.. 9 seriously injured

Post Midle
Post Midle