సెర్ప్ ఆధ్వర్యంలో మహిళలకు ఆటోలు అందజేత…

తిరుపతిముచ్చట్లు:

మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించి వారికి సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటు చేయడమే మన ప్రభుత్వ లక్ష్యమని డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏడి జ్యోతి స్పష్టం చేశారు.
పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ, సెర్ఫ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి టిటిడిసి గొల్లపూడి విజయవాడ నుండి వర్చువల్ గా మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనుగుణంగా తిరుపతి కలెక్టరేట్లో డి.అర్. ఓ పెంచల్ కిషోర్ చేతుల మీదుగా ఉన్నతి పదకం క్రింద దాదాపుగా 15మంది ఎస్.సి ఎస్.టి మహిళలకు ఆటో రిక్షాలు అందజేశారు. ఈ సందర్భంగా డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏడి జ్యోతి మాట్లాడుతూ తిరుపతి జిల్లా నుండి ఎన్నికైన ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాల కింద ఆటోలను అందజేయడం జరిగిందని అన్నారు.పంపిణీ చేసిన ఆటో విలువ దాదాపుగా 350000 వరకు ఉంటుందని తెలిపారు. త్వరలో మరిన్ని ఆటోలు అందజేయడం జరుగుతుందని అన్నారు.

Post Midle

ఈ కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి ప్రభావతి డి ఆర్ డి ఏ సిబ్బంది ఏ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Autos will be given to women under Serp…

Post Midle