నంద్యాలలో సహాయక చర్యలు ముమ్మరం

Date:16/09/2019

నంద్యాల  ముచ్చట్లు:

నంద్యాల రెవెన్యూ డివిజన్  లో ఆదివారం రాత్రి స్థానికంగా కురిసిన భారీ వర్షాల నేపధ్యంలో సహాయక చర్యలను కర్నూలు జిల్లా ఇంఛార్జి కలెక్టర్ రవి పట్టన్ శెట్టి దగ్గరుండి పర్యవేక్షించిరు. అత్యధిక వర్షపాతం నమోదయిన గోస్పాడు, సిరివెళ్ల, ఆళ్లగడ్డ మండలాల్లో పర్యటించి సహాయక చర్యలను అయన పరిశీలించారు.  తరువాత అయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎవరూ బయపడవద్దు. అన్ని సహాయక చర్యలను చేపట్టాం.పాఠశాలల్లోకి నీరు వచ్చిన చోట్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా స్థానిక సెలవు ప్రకటించామని అయన అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వరద ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాం. .

 

 

 

గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా త్రాగునీటిని పునరుద్ధరించామని అన్నారు. పంటలు నీట మునిగిన ప్రాంతాల్లో పంటనష్ట  వివరాలను అధికారులునమోదు చేస్తున్నారు. నంద్యాల రూరల్,  మహానంది, ఆళ్లగడ్డ,చాగలమర్రి,  సిరివెళ్ల, గోస్పాడు, కోయిలకుంట్ల మండలాల తసీల్దారు, ఎంపిడిఓ ల ఆధ్వర్యంలో సహాయక చర్యల బృందాల ఏర్పాటు చేసాం. సహాయక చర్యలు .ముమ్మరంగా కొనసాగుతున్నయని అయన అన్నారు. వరద ప్రాంతాల్లో బాధితులకు ఫుడ్,నీరు సరఫరా, ..

 

 

 

 

సహాయం కొనసాగింపు వుంటుందని అన్నారు. ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న రెవిన్యూ, పోలీసు, ఇరిగేషన్, విద్యా, వైద్య , గ్రామీణ నీటి సరఫరా, ఆర్ అండ్ బి, నేషనల్  హైవేస్,  పంచాయతీ రాజ్,  విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక శాఖ, విద్యుత్, మత్స్య శాఖ, రవాణా, ఆర్టీసీ, తదితర అన్ని శాఖల  అధికారులు పాల్గోన్నారు.

గాలింపు కొనసాగుతోంది : ఏపీఎస్డీఎమ్ఏ

Tags: Auxiliary activities in Nandiyam are covered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *