ధర్మపురి ప్రజలకు అందుబాటులో

–   అంబులెన్స్ సేవలు

Date:19/09/2020

ధర్మపురి  ముచ్చట్లు:

తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్  తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన “గిఫ్ట్ ఏ స్మైల్” పిలుపుకు స్పందించి, సంక్షేమ  మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ,  ఉపయోగ పడేలా అంబులెన్స్ ను సమకూర్చారు. శనివారం ఈ మేరకు ప్రగతి భవన్ లో ఐటీ & పురపాలక మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రత్యేక 108 వాహనం సేవలు మరో మూడు నుండి నాలుగు రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రాబోతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,  రైతు బంధు సమితి అధ్యక్షుడు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే లు మహేశ్ రెడ్డి, అరెక పూడి గాందీ, గువ్వల బాలరాజు , చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి  పాల్గొన్నారు.

“గూడు” పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వాలి

Tags:Available to Dharmapuri people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *