అవాంతరాలు..ఆందోళనలు..

Date:07/12/2018
ఖమ్మం ముచ్చట్లు:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశాల్లో విద్యుత్ ఉత్పత్తి ఒకటి. ఖమ్మంలోని కేటీపీఎస్‌ ద్వారా మంచి విద్యుత్ . 7వ దశలో విద్యుత్‌ ఉత్పత్తికి పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిర్మాణ పనులు శరవేగంగా జరిగినప్పటికీ ఉత్పత్తి మాత్రం అనుకున్న స్థాయిలో రాకపోవడంతో తెలంగాణ ఏర్పడక ముందు ఇక్కడ 6,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. ఓసీ–2లో 120 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి జీ–13, జీ–8 బొగ్గు గ్రేడ్లు పుష్కలంగా ఉన్నాయి. జీ–13లో ఉత్పత్తి పెద్దమొత్తంలోనే ఉంది. నెలకు 3.8 లక్షల టన్నుల బొగ్గు లభిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా మూడు దశాబ్దాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. గనుల విస్తరణతో వచ్చే రెండు మూడేళ్లలో సత్తుపల్లి కేంద్రంగా జీఎం కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంతవరకూ బాగానే ఇక్కడ కొన్ని కార్యకలాపాలపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బొగ్గు తవ్వకాల్లో భాగంగా ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో పేలుళ్లు జరుపుతున్నారు. ఈ పేలుళ్ల తీవ్రతకు సమీప గ్రామాల్లోని ఇళ్లు కంపిస్తున్నాయి. ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చి దెబ్బ తింటున్నాయి. ఒక్కోసారి అధిక మోతాదుతో భూమి కంపిస్తోందని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉండడం అభివృద్ధికి సూచికే. కానీ.. గనుల్లో తరచూ సంభవిస్తున్న పేలుళ్లపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Tags:Avantaraluandolanalu ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *