Date:04/09/2020
ముంబై ముచ్చట్లు:
అందరకీ విద్య అనేది నేటికీ చాలా మందికి అందని ద్రాక్షే అవుతోంది. పేదరికం చాలా కుటుంబాల్లో చిన్నారులను విద్యకు దూరం చేస్తోంది. అంతేకాకుండా కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న ప్రస్తుత సంక్షోభంలో విద్యా బోధన మరింత సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో డిజిటల్ విద్య ద్వారా ఆ లోటును భర్తీ చేయడానికి ‘క్యాంప్ డైరీస్’ లాంటి కొన్ని సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. యంగ్ హీరోయిన్ అవికా గోర్.. అలాంటి సంస్థలకు మద్దతు ఇస్తూ తన మంచి మనసు చాటుకుంటోంది. వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులకు సాయం అందించింది.మిలింద్ చాంద్వాని 2017 నుంచి ‘టీచ్ ఫర్ ఇండియా’తో పని చేస్తున్నారు. పేద, వెనుకబడ్డ వర్గాలకు చెందిన పిల్లలకు విద్యను సరదాగా, సులభంగా నేర్పడానికి మరో అడుగు ముందుకేసి ‘క్యాంప్ డైరీస్’ అనే సంస్థను స్థాపించారు. ఇందులో భాగంగా శని, ఆది వారాల్లో క్యాంపులు పెట్టి పేద విద్యార్థుల విద్యకు అదనంగా అవసరమైన కార్యకలాపాలను, ఆటపాటలను నిర్వహిస్తున్నారు. క్యాంపులో మంచి ప్రతిభ చూపిన పిల్లలకు సలహాదారులు (మెంటార్)గా నిలుస్తూ వారికి అన్ని విధాలా మద్దతను అందిస్తున్నారు.‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా దేశ ప్రజలందరికీ సుపరిచితమైన నటి అవికా గోర్.. సినిమాల్లోనూ చక్కని నటనతో ఆకట్టుకుంది. నటనతో పాటు తన గొప్ప మనసును కూడా చాటుకుంటోంది. క్యాంప్ డైరీస్ సంస్థకు అన్ని విధాలా తన మద్దతు అందిస్తోంది.అవికా గోర్ తన పుట్టిన రోజు ను కూడా క్యాంప్ డైరీస్ కోసమే కేటాయించింది. తన అభిమానులు, శ్రేయోభిలాషుల తన బర్త్ డే సందర్భంగా కానుకలు పంపించడానికి బదులు క్యాప్ డైరీస్ సంస్థ కోసం నిధులు సేకరించాలని కోరింది. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘మిలాప్’లో ఫండ్ రైసింగ్ ప్రారంభించింది. దీనికి విశేష స్పందన లభిస్తోంది.అవికా గోర్ ఈ ఫండ్ రైసర్ ద్వారా వచ్చిన విరాళాలకు సమానంగా తన సంపాదన లోంచి నిధులను కేటాయిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా క్యాంప్ డైరీస్ ప్రతినిధులు మరిన్ని కార్యక్రమాలను తీర్చిదిద్దుతున్నారు. అవిక పుట్టిన రోజు మిలాప్ ఫండ్ రైసర్ ద్వారా సేకరించిన నిధులతో సిబ్బందికి, వివిధ కార్యక్రమాలకు అవసరమైన సామన్లు సమకూర్చుకున్నారు. వీటిలో ప్రొజెక్టర్లు, గిటార్లతో పాటు కళలు, ఆటలకు సంబంధించిన సామన్లు ఉన్నాయి.
Tags: Avika Gore. Assistance to 3000 students