Avinash Chhata on the blow of Chinababu ..

చినబాబు దెబ్బకే  అవినాష్ ఔటా..

Date:15/11/2019

విజయవాడ ముచ్చట్లు:

అవ‌మానాలు భ‌రించ‌లేక‌నే రాష్ట్ర తెలుగు యువ‌త నేత దేవినేని అవినాష్ టీడీపీని వీడారా..? ఆయ‌న ఎదుగుద‌ల‌ను కావాల‌ని అడ్డుకోవ‌డం వ‌ల్లే ఈ నిర్ణయానికి వ‌చ్చారా..? దేవినేని అవినాష్ ను అడుగ‌డుగునా అడ్డుకున్నది చిన‌బాబేనా..? పేరుకు మాత్రమే తెలుగు యువ‌త ప‌ద‌వి ఇచ్చి.. లోలోప‌ల తొక్కేసే ప‌నిని చినబాబు చేశారా..? అంటే దేవినేని అవినాష్ అనుచ‌రులు, అభిమానుల నుంచి మాత్రం ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. అస‌లు తండ్రి దివంగ‌త నెహ్రూతో పాటు దేవినేని అవినాష్ పార్టీలో చేరిన‌ప్పుడు వాళ్లు ప్రాణం ఉన్నంత వ‌ర‌కు టీడీపీలోనే ఉంటామ‌ని చెప్పారు. త‌ర్వాత నెహ్రూ మృతి చెంద‌డంతో రాజ‌కీయంగా దేవినేని అవినాష్ ను ప‌ట్టించుకోలేద‌న్నది నిజం.ఇందులో బాగంగానే పార్టీకి క‌నీస ప‌ట్టులేని గుడివాడ సీటును దేవినేని అవినాష్ కు ఇచ్చార‌ని అనుచ‌రులు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. దేవినేని అవినాశ్ టీడీపీని వీడారు. వైసీపీలో చేరుతున్న నేప‌థ్యంలో రాజ‌కీయ‌వ‌ర్గావ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ 2016లో టీడీపీలో చేరారు. ఈ స‌మ‌యంలో దేవినేని అవినాష్ కు పార్టీ అధిష్టానం ఓ హామీ కూడా ఇచ్చిన‌ట్లు స‌మాచారం. విజయవాడ తూర్పు లేదా పెనమలూరు సీటు ఇస్తామ‌ని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చార‌ట‌. అస‌లు ఆ ఫ్యామిలీకి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఇవే.నెహ్రూ ఈ ప్రాంతం  నుంచే ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

 

 

 

 

 

 

 

 

ఇలా ప‌ట్టున్న పెన‌మ‌లూరు లేదా విజ‌యవాడ తూర్పు నియోజకవర్గాలను దేవినేని అవినాష్ కు ఇవ్వలేదు. 2019 ఎన్నికల ముందు దాకా దేవినేని అవినాష్ ని పట్టించుకున్న పాపాన పోలేదని, అడిగిన సీట్లు ఇవ్వకపోగా, పార్టీకి క‌నీస ప‌ట్టులేని గుడివాడ సీటును ఇచ్చార‌ని దేవినేని అవినాష్ అనుచ‌ర‌ులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. కేవలం ఎన్నికలకి రెండు నెలల ముందు రాష్ట్ర తెలుగుయువత పదవిని దేవినేని అవినాష్ కు క‌ట్టబెట్టడం గ‌మ‌నార్హం. ఈ ప‌ద‌వి కోసం దేవినేని అవినాష్ ఏకంగా రెండు సంవ‌త్సరాలుగా నీరీక్షించారు.అయితే, దేవినేని అవినాష్ కు ప‌ద‌వి ఇచ్చినా కూడా.. ఏనాడు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం మాత్రం చిన‌బాబు ఇవ్వలేద‌ని, అడుగ‌డుగునా అడ్డుప‌డ్డార‌ని, దేవినేని అవినాష్ ప‌ర్యటించ‌కుండా అడ్డుకున్నార‌ని అనుచ‌రులు మండిప‌డుతున్నారు. ఇక్కడ మ‌రొక విష‌యం ఏమిటంటే.. దేవినేని అవినాష్ చురుగ్గా ప్రజ‌ల్లో, కార్యక‌ర్తల్లోకి వెళ్లడాన్ని కూడా చినబాబుకు పెద్దగా ఇష్టం లేన‌ట్టుగా వ్యవ‌హ‌రించార‌ని కూడా దేవినేని అవినాష్ నిర్వహించిన స‌మావేశంలో అనుచ‌రులు స్పష్టం చేశార‌ట‌.ఈ క్రమంలో పార్టీ కేడర్ లో దేవినేని అవినాష్ కి వచ్చిన పేరు ప్రతిష్టలను చూసి ఓర్వలేక ..ఆయనను రాష్ట్రంలో ఇక ఎక్కడా పర్యటించకుండా గుడివాడకి పరిమితం అవ్వమని లోకేశ్‌ చెప్పింది నిజం కాదా? అని అనుచ‌రులు ప్రశ్నిస్తున్నారు.

 

 

 

 

 

 

 

ఎన్నిక‌ల్లో ఓడిపోయాక కూడా దేవినేని అవినాష్ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ప‌ర్యటించి అక్కడ వైసీపీ కార్యక‌ర్తల దాడుల్లో గాయాల పాలైన బాధితుల‌కు ధైర్యం చెప్పారు. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత దేవినేని అవినాష్ రాజ‌ధాని ఏరియాలో దూకుడు పెంచారు.ఆ త‌ర్వాత దేవినేని అవినాష్ సైలెంట్ అయిపోయారు. దీని వెన‌క చిన‌బాబు ఒత్తిళ్లే కార‌ణ‌మ‌న్న గుస‌గుస‌లు కూడా ఉన్నాయి. ఇక్క‌డ మ‌రొక అంశం ఏమిటంటే.. గుడివాడ‌లో పోటీ చేయ‌డానికి చంద్రబాబు కుటుంబ స‌భ్యులే ముందుకు రాలేద‌ని, కానీ, ఓట‌మి త‌ప్పద‌ని తెలిసి కూడా దేవినేని అవినాష్ కు అదే సీటును ఇచ్చార‌ని, ఇదంతా కూడా దేవినేని అవినాష్ ఎదుగుద‌ల‌ను ఓర్వలేక‌నే చేశార‌నే టాక్ అనుచ‌రుల్లో ఉంది. అక్కడ పోటీ చేసిన దేవినేని అవినాష్ కాస్త అటూ ఇటూగా రు.80 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే దేవినేని అవినాష్ టీడీపీని వీడినట్లు తెలుస్తోంది. దీనిపై లోకేశ్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

 

ఇంటర్ తో ముగిసిపోతున్న ఏజెన్సీ చదువులు

 

Tags:Avinash Chhata on the blow of Chinababu ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *